ప్రజాశక్తి-అద్దంకి: హెచ్‌ఐవి బాధితుల పట్ల వివక్ష చూపకూడదని, అర్హులైన, నిరాదరణ గురైన మహిళలకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా తన వంతు కృషి చేస్తానని అద్దంకి మున్సిపల్ కమిషనర్ తేళ్ల రవికుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్ర మండలి హెల్ప్ టిఐ మేదరమెట్ల ప్రాజెక్టు డైరెక్టర్ బివి సాగర్ తన సిబ్బందితో అద్దంకి కమిషనర్‌ను కలిసి నిరాదరణకు గురై నిరుపేద కుటుంబంలో ఉన్న ఒంటరి మహిళలకు ప్రభుత్వ పథకాలకు అర్హులైన మహిళలకు రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు ప్రభుత్వం నుంచే వివిధ పథకాలను వారికి చేరు అయ్యేవిధంగా కృషి చేయాలని కోరారు. నగర కార్పొరేషన్‌లో ఉన్న అన్ని పాఠశాలల్లో బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలు, బాలలు, మహిళల అక్రమ రవాణా నిర్మూలనకు చేయవలసిన కృషి, బాలల కోసం ఏర్పర్చిన చట్టాలపై అవగాహన కార్యక్రమాలు విస్తతంగా ఏర్పాటు చేయాలని కోరారు. హెచ్‌ఐవి బాధితులకు ప్రభుత్వం నుంచి పెన్షన్ అందించే విధంగా కృషి చేయాలని నగర కమిషనర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో హెల్ప్ టిఐ అద్దంకి అవుట్ రిచ్ వర్కర్ కరుణ, పీర్ ఎడ్యుకేటర్లు పి మల్లేశ్వరి, శివ పార్వతి, పార్వతి, రాధా పాల్గొన్నారు.










