ప్రజాశక్తి - ఏలూరు
ఎయిడ్స్‌పై ప్రతిఒక్కరికీ అవగాహన కల్పించేందుకు ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (ఎఆర్‌హెచ్‌ఇడిఎస్) ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రోగ్రాం మేనేజర్ కీర్తి శిరీష తెలిపారు. బుధవారం సోమవరప్సాడు, తంగెళ్లమూడి, ఏలూరులోని పలుచోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. వీధినాటిక రూపంలో ఎల్‌ఆర్ కృష్ణబాబు బృందం ప్రదర్శన ప్రజలను ఆకట్టుకుంది. వీధినాటకాలతో హెచ్‌ఐవిపై ప్రజలకు అవగాహన కల్పనలో భాగంగా కరపత్రాలు, మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, ఎఆర్‌హెచ్‌ఇడిఎస్ సిబ్బంది, ఒఆర్‌డబ్ల్యూఎస్ సిబ్బంది ఎ.ఆరుణ, బి.సురేష్, ఎఎన్‌ఎం కె.ప్రభావతి, అకౌంటెంట్ ఎమ్‌డి షకీనా, ఎన్‌జిఒ సిబ్బంది పాల్గొన్నారు.










