Mar 17,2023 21:11

ప్రజాశక్తి - ఏలూరు టౌన్‌
             హెచ్‌3 ఎన్‌2 వైరస్‌ పట్ల ఎవరూ భయపడనవసరం లేదని, సాధారణ వైద్యం ద్వారా దానంతట అదే తగ్గిపోతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ డి.ఆశ సూచించారు. స్థానిక ఏలూరు లంబాడిపేట నాలుగో డివిజన్‌ కార్పొరేటర్‌ డింపుల్‌ జోషికుమార్‌ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన డ్రై డే కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ వారానికి ఒకసారి నీటి నిల్వ ప్రాంతాలను శుభ్రం చేయాలని సూచించారు. స్థానిక కార్పొరేటర్‌ డింపుల్‌ జోబ్‌ రిషికుమార్‌ మాట్లాడుతూ ప్రజలందరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు.