Dec 21,2022 00:01

రోడ్డుకు అడ్డంగా కోతులు ఉండడంతో నిలిచిపోయిన వాహనదారులు

ప్రజాశక్తి-మునగపాక రూరల్‌
మండల కేంద్రం మునగపాక నుండి తోటాడ వెళ్లే రహదారిలో కోతులు ప్రయాణికులను హడలెత్తిస్తున్నాయి. ఈ మార్గంలో తోటాడతో పాటు మూలపేట పాటిపల్లి, మంగళవారపేట గ్రామస్తులు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ మార్గంలో కోతులు గుంపులు గుంపులుగా సంచరిస్తూ ఏజెన్సీ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. మార్గమధ్యలో ప్రయాణికులను అటకాయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. పొలాల్లోని కొబ్బరి, అరటి, బొప్పాయి, జామి వంటి ఫల వృక్షాలకు నష్టం వాటిల్ల చేస్తున్నాయని స్థానిక రైతులు వాపోతున్నారు. ఒక్కోసారి ప్రయాణికులను బెదిరించి తిరగబడటంతో ఎక్కడ దాడి చేస్తాయని పలువురు ఆందోళన చెందుతున్నారు. పిల్లలు, వృద్ధులను వానరాలు మరింత భయపెడుతున్నాయని, తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి కోతుల నుండి రక్షణ కల్పించాలని రైతులు, ప్రయాణికులు కోరుతున్నారు.