
హడలెస్తిస్తున్న ఊర కుక్కలు
గాయాల బారిన పడుతున్న వాహనదారులు
కుక్కల నియంత్రణలో పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం
ప్రజాశక్తి - రుద్రవరం
ఊర కుక్కలు ఒకటా రెండా వందలాదిగా రోడ్లపై తిరుగాడుతూ ఇటు బాటసారులను అటు వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి. మండలంలో 21 గ్రామ పంచాయతీలు 20 గ్రామాలు ఉన్నాయి. ఏ గ్రామంలో చూసిన ఊర కుక్కలు దారిన వెళ్లే వారిపై దాడులు చేయడము, మోటార్ సైకిల్ పై వెళ్లే వాహనదారుల వెంట పరిగెత్తి కరవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ సమయంలో మోటార్ సైకిల్ పై వెళ్లే వ్యక్తులు భయపడి అతివేగంగా వెళ్లడం వల్ల ప్రమాదాల బారిన పడి తీవ్ర గాయాల పాడిన పడుతున్నారు. కొందరు మృత్యువాత కూడా పడుతున్నారు . చిన్నారులు, వృద్ధులు, పై కుక్కలు దాడి చేసి తీవ్ర గాయాలు చేయడం చంపడం లాంటివి చేస్తున్నాయి. కుక్కలు కలవడం వల్ల కొందరికి రేబిస్ వ్యాధి వారిన పడుతున్నారు. రాత్రి సమయాలలో విపరీతంగా అరవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. రోడ్లపైకి ఒకేసారి పదుల సంఖ్యలో ఊర కుక్కలు రావడం వల్ల ప్రయాణికులు వాహనదారులు బాటసారిలు ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారు. పంచాయతీ అధికారులుకుక్కల నివారణ చర్యలు తీసుకోకపోవడంతో ఏ గ్రామంలో చూసినా కుక్కల సంఖ్య గణనీయంగా పెరిగింది . ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ఆయా గ్రామాలలో ఊర కుక్క ల బెడద లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.