చిలకలూరిపేట: మండల పరిధిలోని గోవిందాపురంలో రీ సర్వే పనుల గురువారం నాడు జిల్లా జాయింట్ కలె క్టర్ శ్యామ్ ప్రసాద్ పరిశీలించారు. రీ సర్వే కార్యక్రమంలో భాగంగా భూముల హద్దురాళ్లు నాటే కార్యక్రమం పనులు ఎట్లా జరుగుతు న్నాయో పరిశీలించి, సంబంధిత రెవెన్యూ శాఖ అధి కారు లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఇప్పటి వరకు చేపట్టిన పనుల వివరాలను అడిగి తెలుసు కుని, జరుగు తున్న పనులపై పలు సూచనలు చేశారు. త్వ రితగతిన హద్దురాళ్లు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సంబం ధిత శాఖల అధికారులకు సూచించారు. ఈ కార్య క్రమంలో చిలకలూరిపేట తహశీల్దార్ సుజాత, మండల సర్వేయర్, సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నాదెండ్ల : జిల్లాలో రీ సర్వే పనులు వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. మండలం లో జరుగుతున్న రీ సర్వే పనుల అనంతరం రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు, వీఆర్వో నిర్వహిస్తున్న పనులపై జెసి పరిశీలించారు. తుబాడు, ఇర్లపాడు గ్రామాల్లో రెవెన్యూ కేంద్రాల్లో జరుగుతున్న పనులు, రికార్డుల నిర్వహణ, ముటేషన్ పనులు,రీ సర్వే పనులు జరుగుతున్న తీరుపై ఆకస్మిక తనిఖీ చేశారు. విలేజ్ సర్వేయర్లు లాగిన్ లో వస్తున్న సమస్యలు పరిష్కరించేందుకు తీసుకున్న చర్యల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. వీఆర్‌ఓ లాగిన్ లోకి వచ్చిన రెవెన్యూ అంశాలకు సంబంధించి చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకొని లబ్ధి దారులకు గ్రామ సభలను ఏర్పాటు చేసి రీ సర్వే విధానాల వల్ల కలిగే ఉపయోగాలను తెలియజేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు వీఆర్వో లు తదితరులు పాల్గొన్నారు. జగనన్న పాల వెల్లువ కార్యక్రమాన్ని వేగంగా పాడి రైతులకు చేరవేసి మేలు చేయాలని జెసి ఆదేశించారు. నాదెండ్ల మండల పశువైద్య కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. విధుల్లో ఉన్న పశువైద్య వైద్య అధికారులు, సిబ్బందితో మాట్లాడి, రికార్డులను పరిశీలించారు. వైద్య సేవలను అందిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. జగనన్న పాలవెల్లువ కార్యక్రమ పురోగతిని అడిగి తెలుస కొని, కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లాలని సూచించారు.అందుకు సంబంధించిన పరికరాలు, కేంద్రం నిర్వహణ తదితర అంశాలపై అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు.










