Aug 23,2023 19:27

సమావేశంలో పాల్గొన్న అధికారులు

ప్రజాశక్తి - లింగసముద్రం : లింగసముద్రంలోని సచివాలయం-1లో బుధవారం హౌసింగ్‌ లబ్ధిదారులతో సమావేశం జరిగింది. డిఎల్‌డిఒ పద్మావతి మాట్లాడుతూ అందరూ గృహాలను నిర్మించుకోవాలని చెప్పారు. ప్రభుత్వ నుంచి అందే వాటి వివరాలను లబ్ధిదారులకు వివరించారు. త్వరగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని తెలిపారు. హౌసింగ్‌ డిఈ శ్రీనివాసులు, ఎంపిడిఓ శేషుబాబు,వైసిపి కన్వీనర్‌ పిచ్చపాటి తిరుపతిరెడ్డి,సర్పంచ్‌ రాఘవులు,హౌసింగ్‌ ఏఈ వెంకటేష్‌,వర్క్‌ ఇన్స్పెక్టర్‌ నిర్మల,సచివాలయం సిబ్బంది ఉన్నారు.