Oct 05,2023 23:24

ప్రజాశక్తి -సామర్లకోట రూరల్‌ రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా వరుసగా రెండోసారి పదవీ బాధ్యతలను దవులూరి దొరబాబు గురువారం చేపట్టారు. సిఎం వైఎస్‌.జగన్‌ ఆదేశాల మేరకు ఈ నెల 3న దొరబాబును గృహ నిర్మాణ సంస్థ చైర్మన్‌గా నియమిస్తూ జిఒ జారీ చేశారు. విజయవాడ నిర్మాణ భవన్‌లో గురువారం దొరబాబు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ సిఎం జగన్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని రాబోవు రోజుల్లో జగనన్న ఇళ్ల నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని, మరోసారి అవకాశం ఇచ్చిన సిఎం జగన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దొరబాబు వెంట పలువురు నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.