నేషనల్ హైవే 340 బి పనులను పరిశీలిస్తున్న మున్సిపల్ చైర్మన్ చలం రెడ్డి
హైవే పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్
ప్రజాశక్తి - బేతంచెర్ల
ఓరకల్లు మండలం సోమయాజుల పల్లె నుండి బేతంచెర్ల మీదుగా డోన్ హైవే వరకు జరుగుతున్న నేషనల్ హైవే 340 బి రహదారి పనులను మున్సిపల్ చైర్మన్ సిహెచ్ చలం రెడ్డి సోమవారం పరిశీలించారు. బేతంచెర్ల పట్టణంలోని ఐల చెరువు ఎస్విజి రాఘవేంద్ర ఫ్యాక్టరీ దగ్గర నిర్మిస్తున్న ఫస్ట్ బ్రిడ్జి పనులను, వాటి నాణ్యతను చైర్మన్ పరిశీలించారు. రహదారి నిర్మాణ పనులపై కాంట్రాక్ట్‌లతో చర్చించి నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు.










