రహదారి నిర్మాణ పనులను పరిశీలిస్తున్న ఆర్‌డిఒ సూర్యకళ
ప్రజాశక్తి - జామి : మండలంలో చేపడుతున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణ పనులను ఆర్‌డిఒ ఎం.వి.సూర్యకళ గురు వారం పరిశీలించారు. ఆమె హైవే బాధితుల సమస్యపై విచారణ నిమిత్తం జామి విచ్చేశారు. అనంతరం రీసర్వే గ్రామమైన లక్ష్మీపురం రైతులతో మాట్లాడారు. పలువురు రైతులు వారి సమస్యలను ఆర్‌డిఒ దృష్టికి తీసుకొచ్చారు. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని తహశీల్దార్‌కు ఆదేశించారు. రీ సర్వేకు సంబంధించి ఇకెవైసిపై తహశీల్దార్ హేమంత్ కుమార్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, భూసేకరణ అధికారులు ఉన్నారు.










