ప్రజాశక్తి -గరుగుబిల్లి : పౌష్టికాహార లోపం, బరువు, ఎదుగుదల తక్కువ ఉన్న పిల్లలను గుర్తించి తగు నివారణ చర్యలు చేపట్టాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి (డిఐఒ) డాక్టర్ టి. జగన్మోహనరావు సూచించారు. ఈ మేరకు ఆయన మండలంలో ఉద్ధవోలు, చినగుడబ, దళాయివలసను మంగళవారం ఆకస్మికంగా సందర్శించి అంగన్వాడీ కేంద్రాలను, వెల్నెస్ సెంటర్ తనిఖీ చేశారు. ప్రతినెలా పిల్లల బరువు, శారీరక ఎత్తు సరిగా నమోదు చేస్తున్నారా లేద అని, అలాగే పోషకాహార లోపం ఉన్న పిల్లలు ఎవరైనా ఉన్నారా అని రికార్డుల్లో పరిశీలించారు. పిల్లల బరువు, శారీరక ఎత్తును అక్కడ ఉన్న పరికరాలతో డిఐఒ స్వయంగా సరిచూచి పరిశీలించారు. గణాంకాలు పక్కాగా నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. పిల్లలంతా పౌష్టికాహారం సరిగా తీసుకునేలా చూడాలన్నారు. ఐరన్ సిరప్‌ను విధిగా వారానికి రెండు సార్లు వేయించాలని ఆదేశించారు. పిల్లల ఆరోగ్య పరిశీలన చేశారు. ప్రతి నెలా పిల్లల బరువు ఏ మేరకు వృద్ధి చెందుతుందో గమనించాలని, లేని పక్షంలో ఎన్‌ఆర్సి కేంద్రాల్లో చేర్చాలని స్పష్టం చేశారు. అంగన్వాడీ, వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేసి పిల్లల ఆరోగ్యం దష్టి సారించాలని,వారి తల్లిదండ్రులతో అవగాహన సదస్సు లను నిర్వహించి పిల్లల్లో ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రతలు, వాటి నివారణోపాయాలు వివరించాలన్నారు. అలాగే వెల్నెస్ కేంద్రాల్లో రికార్డులను ఆయన పరిశీలించి వారి పరిధిలో ఉన్న ఐదేళ్ల లోపు పిల్లలు, గర్భిణీలలో హైరిస్క్ ఉన్న వారిని గుర్తించి పర్యవేక్షణ చేయాలన్నారు. కార్యక్రమంలో సూపర్ వైజర్ జయగౌడ్, వైద్య సిబ్బంది బి. పార్వతి, ఎమ్.మౌనిక, జి.మౌనిక, అంగన్వాడీ సిబ్బంది ఎం.భవాని, బి.భారతి,ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.










