Nov 17,2023 21:13

కేసుల వివరాలు పరిశీలిస్తున్న డిఐఒ జగన్మోహనరావు

ప్రజాశక్తి-సీతానగరం :  హైరిస్క్‌ గర్బిణులను గుర్తించి ఆరోగ్య పర్యవేక్షణ చేయాలని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి(డిఐఒ) డాక్టర్‌ టి. జగన్మోహనరావు సూచించారు. శుక్రవారం ఆయన సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఆసుపత్రిలో గర్భిణీలకు పక్కాగా ఆరోగ్య తనిఖీలు నిర్వహించాలని తద్వారా, గర్భిణీ ల్లో ఉండే ఆరోగ్య సమస్యలు గుర్తించవచ్చని తెలిపారు. హైరిస్క్‌ కు కారణమైన ఆరోగ్య సమస్య నివారణ చర్యలు చేపట్టి క్షేత్ర స్థాయి సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలను హైరిస్క్‌ గర్భిణుల ఆరోగ్య సేవలకు ఉపయోగించాలని సూచించారు. సంబంధిత సచివాలయం సిబ్బంది ఆర్‌సిహెచ్‌ పోర్టల్‌ లో హైరిస్క్‌ గర్భిణుల వివరాలు ఖచ్చితంగా నమోదు చేయలన్నారు. అనంతరం వ్యాక్సిన్‌ స్టాక్‌, వినియోగం,మిగులు నివేదికలు ఎప్పటికప్పుడు ఈవిన్‌ లో ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. జెఎఎస్‌ రిఫరల్స్‌, ఆరోగ్యశ్రీ అర్హుల చికిత్సకు అవసరమైన కార్యచరణ త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.