May 10,2023 20:47

పుష్పగుచ్చంతో అభినందిస్తున్న ఉద్యోగుల సంఘం నాయకులు

ప్రజాశక్తి-గుంటూరు లీగల్‌ : రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని కోర్టుల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసినందుకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాకు ఆంధ్రప్రదేశ్‌ న్యాయశాఖ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు బుధవారం అసోసియేషన్‌ నాయకులు జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాను హైకోర్టులోని చీఫ్‌ జస్టిస్‌ చాంబర్‌లో కలిసి పూలబొకే అందచేసి, శాలువాతో సన్మానించారు. జస్టిస్‌ మిశ్రాను కలిసిన వారిలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు అక్కెన వేణుగోపాల్‌రావు, ఆంధ్రప్రదేశ్‌ న్యాయశాఖ నాల్గవ తరగతి ఉద్యోగుల రాష్ట్ర సంఘం అధ్యక్షులు రామరాజు చంద్రశేఖర్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ రాచకొండ శ్రీనివాసరావు, జాయింట్‌ సెక్రెటరీ రావుల నవీన్‌ కుమార్‌ ఉన్నారు.