Jun 08,2023 00:23

పూజలు నిర్వహిస్తున్న హైకోర్టు జడ్జి

కొల్లూరు : ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో ఆనందంగా ఉంటుదని హైకోర్టు జడ్జి బి.కష్ణమోహన్‌ తెలిపారు. మండల పరిధిలోని చిలుమూరు గ్రామంలోని రామేశ్వర క్షేత్రాన్ని బుధవారం హైకోర్టు జడ్జి సందర్శించారు. తొలుత రాహువు, కేతువు, విగ్రహాల మందిరానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ చిలుమూరులోని ఉభయ రామేశ్వర క్షేత్రం ఎంతో పేరుగాంచిన క్షేత్రమని తెలిపారు. స్వామి వారిని దర్శించుకోవడం తమ అదష్టంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు