Oct 24,2023 22:05

విజయ పాల ఉత్పత్తులను ఆవిష్కరిస్తున్న చిన్న జీయర్‌స్వామి, చైర్మన్‌ చలసాని ఆంజనేయులు తదితరులు

ప్రజాశక్తి - వన్‌టౌన్‌ : హైదరాబాద్‌ మార్కెట్‌లోకి విజయ పాలు, పాలఉత్పత్తుల ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం శంషాబాద్‌లోని జీయర్‌స్వామి ఆశ్రమంలో శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ స్వామి వారి చేతుల మీదగా ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా చిన్న జీయర్‌ స్వామి మాట్లాడుతూ పాడి రైతులకు కష్ణా మిల్క్‌ యూనియన్‌ దేశంలోనే అధిక ధర, బోనస్‌ ఇవ్వడం, పాడి రైతు, పశు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ప్రోత్సహించడం అభినందనీయమని తెలిపారు. భవిష్యత్తులో ఛైర్మన్‌ చలసాని ఆంజనేయులు సారధ్యంలో కష్ణా మిల్క్‌ యూనియన్‌ పాలు, పాల ఉత్పత్తులు కష్ణా నది పరివాహక ప్రాంతమంతా విస్తరించాలని అభిలషించారు. కష్ణా మిల్క్‌ యూనియన్‌ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ నాణ్యతలో రాజీ లేకుండా కష్ణా మిల్క్‌ యూనియన్‌ ఆరు దశబ్దాలుగా వినియోగదారులకు నాణ్యమైన పాలు, పాల ఉత్పత్తులను అందజేస్తుందని తెలిపారు. సమితికి పాడి రైతులు, వినియోగదారులు రెండు కన్నులని, అహర్నిశలు వారి అభివద్ధికి, సంక్షేమానికి సమితి కషి చేస్తుందని తెలిపారు. విజయ పాలు, పాల ఉత్పత్తులను హైదరాబాదు వాసులకు రేపటినుండి అందించడం జరుగుతుందని చెప్పారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో మేనేజింగ్‌ డైరెక్టర్‌ కొల్లి ఈశ్వరబాబు, పాలక వర్గ సభ్యులు దాసరి వెంకట బాలవర్ధనరావు, ఉయ్యూరు అంజి రెడ్డి,వెంకట నగేష్‌, చలసాని చక్రపాణి , బొట్టు రామచంద్రరావు, డి.జి.ఎం సేల్స్‌ డి.లక్ష్మణ, సేల్స్‌ మేనేజర్‌ డి.సుబాష్‌, లింగస్వామి, సిఅండ్‌ఎఫ్‌ ఏజెంట్‌ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.