ప్రజాశక్తి-విజయవాడ అర్బన్: నగరంలోని హౌటల్ నోవాటెల్‌లో హై లైఫ్ బ్రైడ్స్ పేరుతో వివాహ ఫ్యాషన్ వస్త్ర ప్రదర్శన మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ప్రముఖ నటి కామాక్షి భాస్కర్ల, మిస్ తెలంగాణ-2023 ఉర్మిల చౌహాన్ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రదర్శన నిర్వాహకులు డొమినిక్ మాట్లాడుతూ వివాహ ఫ్యాషన్‌లకు సంబంధించి అన్ని రకాలైన బ్రాండ్‌లతో కూడిన వస్త్రాలు ప్రదర్శనలో ఉంచినట్లు తెలిపారు. ప్రదర్శన ఈ నెల 18 నుండి 20వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఉంటుందని తెలిపారు. ప్రదర్శనలో వెడ్డింగ్ ఫ్యాషన్ జ్యూయలరీ, బ్రైడల్ ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులు ఉంటాయని తెలిపారు.










