Apr 23,2023 21:43

జలకాలాడుతున్న చిన్నారులు

హాయి హాయిగా.. చల్లచల్లగా..
- జలకాలాటలలో చిన్నారులు..
ప్రజాశక్తి - పగిడ్యాల

       రోజు రోజుకు ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. ఇటు పట్టణాలలో అటు గ్రామీణ ప్రాంతాలలో భానుడు మండిపోతున్నాడు. ఉష్టోగ్రత 43 డిగ్ల్రీ వరకు నమోదు అవుతుండంతో ప్రజలు ఇండ్లలో నుంచి బయటకు రావడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బయటకు రావాలంటేనే ఎండ వేడికి బెంబెలెత్తిపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పెద్ద పెద్ద చెట్ల కింద కూర్చుని ఎండ వేడిమి నుంచి కొంత ఉపశమనం పొందుతున్నారు. మూగజీవాలు పశుగ్రాసం కోసం పొలాల్లోకి వెళ్లి ఎండ వేడిమికి తట్టుకోలేక ఎక్కడ నీడ ఉంటే అక్కడ చెట్ల కిందకు, నీటి కుంటల్లోకి వెళ్లి సేదతీరుతున్నాయి. పిల్లలు బావులలో, కుంటలలో ఈత కొడుతూ సేద తీరుతున్నారు. ఒంటిపూట పాఠశాలలు ఉండడంతో మధ్యాహ్నం తర్వాత పిల్లలు ఈతకు వెల్లుతున్నారు. పాత ముచ్చుమర్రి గ్రామంలో రాయలసీమ పుష్కరఘాట్‌ సమీపాన నిర్మించిన దోబిఘాట్‌లో పిల్లలు నీటిలో జలకాలాడుతూ కేరింతలు ఒడుతున్నారు. ఎండ వేడిమికి తట్టుకోలేక పిల్లలు పాఠశాలల నుంచి ఇంటి వచ్చిన వెంటనే నీటి కుంటల్లో ఈత కొడుతూ సేద తీరుతున్నారు.