Sep 27,2023 20:28

అధికారులతో మాట్లాడుతున్న దళిత సంఘం నాయకులు

ప్రజాశక్తి - కొత్తవలస : స్థానిక పోలీసు స్టేషన్‌ను ఆనుకుని ఉన్న ఎస్‌సి బాలుర వసతి గృహాన్ని బీసీ బాలికల వసతి గృహంగా మార్పు చేయొద్దని దళిత సంఘాల నాయకులు అధికారులను వేడుకున్నారు. మండల ప్రత్యేకాధికారి ఆర్‌. పాపారావు, ఎంపిడిఒ వై. పద్మజ, తహశీల్దార్‌, వెల్ఫేర్‌ అధికారులు, ఎంఇఒ బుధవారం వసతి గృహం మార్పు చేద్దామని హాస్టల్‌కు వచ్చారు. ఈ విషయాన్ని గమనించిన దళిత సంఘాల నాయకులు బోని కృష్ణ నాయకత్వంలో దళిత సంఘాల నాయకులు వసతి గృహాన్ని మార్పు చేయొద్దంటూ ప్రత్యేకాధికారి వినతి పత్రాన్ని అందించారు. ఇప్పటికే హాస్టల్లో 52 మంది విద్యార్థులు ఉన్నారని గుర్తు చేశారున గత కొంతకాలంగా బీసీ బాలికల హాస్టల్‌ వాతావరణం బాగోలేదని ఈ హాస్టల్‌ను హైస్కూల్‌ సమీపంలో గల ఎస్‌సి బాలుర హాస్టల్‌కు మార్పు చేయాలని అధికారులు సూచించారు. బాలికల హాస్టల్‌లో వసతులు బాగోలేదని, తరచూ విద్యార్థులు రోగాలకు గురవుతున్నారని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో అధికారులు హాస్టళ్లను పరిశీలించారు.