Jul 30,2022 23:52

మెస్‌లో భోజన నాణ్యత పరిశీలిస్తున్న రెక్టార్‌ సమత

ప్రజాశక్తి-విశాఖపట్నం : ఆంధ్రవిశ్వవిద్యాలయం విద్యార్థినుల వసతిగృహం మెస్‌లో భోజన నాణ్యతను ఏయూ రెక్టార్‌ ఆచార్య కె.సమత శనివారం ప్రత్యక్షంగా పరిశీలించారు. మహారాణిపేటలోని మెస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజన నాణ్యత, రుచి ప్రత్యక్షంగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి భోజ నాణ్యత ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. అనంతరం హాస్టల్‌ స్టోర్‌ రూమ్‌ను తనిఖీ చేశారు. హాస్టల్‌కు వచ్చే పదార్థాలు వివరాలు, స్టాక్‌ రిజిష్టర్‌, వస్తువుల నాణ్యత తదితర అంశాలను పరిశీలించారు. భోజన నాణ్యత పట్ల విద్యార్థినులు సంతృప్తి వ్యక్తం చేశారు. రెక్టార్‌ వెంట చీఫ్‌ వార్డెన్‌ డాక్టర్‌ ఎ.పల్లవి తదితరులు పాల్గొన్నారు.