Apr 16,2023 01:49
ప్లేట్లు అందజేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-రేపల్లె: పీపుల్స్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 132వ జయంతి సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్‌ విద్యార్థులకు 200 భోజన ప్లేట్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా ఫారెస్ట్‌ అధికారి బి విజయకుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలలు సాకారం చేసుకొని ఉన్నత స్థితిలో ఉండాలని ఆకాంక్షించారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేద్కర్‌కు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏసిటిఓ అధికారి జి సురేష్‌, డాక్టర్‌ వసంతరావు, అధ్యక్షులు విజరుకుమార్‌, హనోక్‌, పి బాలాజీ, రాజారత్నం, పెనుమాల సుబ్బారావు, రమేష్‌ రాంజీ, మునిపల్లి సుబ్బయ్య, రమేష్‌, ప్రసాద్‌ పాల్గొన్నారు.