Nov 07,2023 21:47

విచారణ చేపట్టిన ఎస్సై రాజరాజేశ్వర రెడ్డి

 ఖాజీపేట స్థానిక మైదుకూరు రోడ్డులోని సాయిబాబా ఆలయం వెనుక ఉన్న బాలికల వసతి గహ సంరక్షణ అధికారి బుక్కే మంగమ్మ తీరుపై విద్యార్థినుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె భర్త మూడే సుధాకర్‌ నాయక్‌ విద్యార్థినుల అసభ్యపై ప్రవర్తనపై మంగళవారం హాస్టల్‌ ఎదుట వారు ఆందోళన చేపట్టారు. చివరకు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని ఎస్‌ఐ రాజరాజేశ్వర్‌రెడ్డి కేసు నమోదు చేశారు. వార్డెన్‌ భర్త హాస్టల్‌ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తనపై, వార్డె తీరుపై తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వసతి గహం పరిసరాల్లో వార్డెన్‌ భర్త ఎందుకుంటున్నారని పోలీసుల ఎదుట తల్లిదండ్రులు నిలదీశారు. వసతి గహాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఏమాత్రం లేదని పేర్కొన్నారు. వసతి గహంలో సిసి కెమెరాలు ఏర్పాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వసతి గహంలో విద్యార్థులకు అందిస్తున్న మెనూ కూడా సక్రమంగా ఉండడం లేదని పేర్కొన్నారు. గతంలోనూ ఆయనపై పలు ఆరోపణలు వచ్చినా సంబంధిత అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోలేని వాపోయారు. మొక్కుబడిగా విచారిచంఇ ఎటువంటి చర్యలు తీసుకోలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. వార్డెన్‌ను బదిలీ చేసి నూతన సంరక్షణ అధికారిని నియమంచాలని కోరారు. ఇలాంటి చర్యలు చోటు చేసుకోకుండా జిల్లా ఉన్నతాధికారులు రక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఎస్‌ఐ మాట్లాడుతూ విద్యార్థుల పట్ల వార్డెన్‌ భర్త ప్రవర్తించిన తీరు పట్ల మైదుకూరు గ్రామీణ సిఐ శ్రీనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుందన్నారు. వార్డెన్‌ భర్త సుధాకర్‌ నాయక్‌పై ఫోక్సో కేసు నమోదు చేశామని తెలిపారు. కడప రెవెన్యూ డివిజనల్‌ ఆఫీసర్‌ మధుసూదన్‌ వసతిగహానికి చేరుకొని విద్యార్థులను, వారి తల్లిదండ్రులను విచారించారని తెలిపారు.