Jul 13,2023 22:01

సమావేశంలో మాట్లాడుతున్న పిఒ కల్పన కుమారి

ప్రజాశక్తి-సీతంపేట: ఉపాధిహామీ ద్వారా చేపడుతున్న హార్టికల్చర్‌ ప్లాంటేషన్‌ ను పెంచాలని ఐటిడిఎ పిఒ కల్పనకుమారి.. అధికారులను ఆదేశించారు. గురువారం ఐటిడిఎ పరిధిలోని మండలాలకు చెందిన ఎపిడిలు, ఎపిఒలు, ఇసిలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఒ మాట్లాడుతూ అటవీ పట్టాలు కలిగిన లబ్ధిదారులకు 150 రోజుల పనిదినాలు కల్పించాలని సూచించారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. ప్రతీ మండలంలో 100 ఎకరాల వరకు హార్టికల్చర్‌ ప్లాంటేషన్‌ చేయాలన్నారు. ఐటిడిఎ పరిధిలో అన్ని పాఠశాలల్లో, ఆసుపత్రిలలో, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాంటేషన్‌ చేయాలని చెప్పారు. వర్షాకాలంలో కూడా ఉపాధి పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని, అందుకు తగ్గ పనులను గుర్తించాలని అన్నారు. ఉపాధిహామీ సిబ్బంది బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. సమావేశంలో ఎపిడి శ్రీహరిరావు, తదితరులు పాల్గొన్నారు.
అనంతరం గహ నిర్మాణ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు జగనన్న గహ నిర్మాణాలు పనులు శరవేగంగా పూర్తి చేయాన్నారు. లేఔట్‌లో నిర్మాణాల లక్ష్యాలు పూర్తి చేయాలన్నారు ఈ సమావేశంలో హౌసింగ్‌ డిఇ మోహన్‌ రావు, ఎఇ వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.