పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న హైకోర్టు జడ్జి మన్మధరావు
బి.కొత్తకోట : మదనపల్లి, ఒంగోలు, సింగరాయకొండ కోర్టుల పరిశీలనల్లో భాగంగా హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ జడ్జి మన్మధరావు ఆదివారం బి.కొత్తకోట మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్సీలీహిల్స్‌కు విచ్చేశారు. అల్పాహారం తర్వాత కొండపై విస్తతంగా పర్యటించి, ఆహ్లాదకర వాతావరణంలో సేదతీరారు. ముఖ్యంగా ప్రసిద్ధిగాంచిన గవర్నర్ బంగ్లా, విపాయింట్, గాలిబండ ఫారెస్ట్ బంగ్లాను సందర్శించారు.ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ భారతదేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన హార్సీలీహిల్స్ ప్రకతి రమణీయంగా ఉందని, ఇక్కడ అందాలు ఆకట్టుకున్నాయని కితాబునిచ్చారు. అనంతరం ఆయన హార్సీలీ హిల్స్ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. జడ్జి వెంట ఎస్‌ఐ రామ్మోహన్, పోలీసులు,కోర్టు సిబ్బంది ఉన్నారు.










