Oct 31,2022 23:46

హార్లిక్స్‌ వాటర్‌బాటిళ్లతో విద్యార్థులు

ప్రజాశక్తి -భీమునిపట్నం : చిప్పాడ, దివీస్‌ ఆధ్వర్యంలో స్థానిక పండిట్‌ నెహ్రూ జివిఎంసి ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉచితంగా హార్లిక్స్‌, వాటర్‌ బాటిళ్లను సోమవారం పంపిణీ చేశారు. హెచ్‌ఎం తిరుమల శ్రీదేవి, దివీస్‌ సంస్థ సిఎస్‌ఆర్‌ మేనేజర్‌ సురేష్‌కుమార్‌ ఆధ్వర్యంలో వీటిని విద్యార్థులకు ఎంఇఒ ఎ.బాలామణి అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగభూషణరావు, చంద్రరావు, లక్ష్మి,భారతి, ఆదర్శ హిందీ ప్రేమీ మండలి అధ్యక్షులు కెెఎస్‌ఆర్‌ కృష్ణారావు పాల్గొన్నారు.అలాగే కస్తూర్బా పాఠశాలలోని 280మంది విద్యార్థినులకు రూ.38వేలు విలువైన హార్లిక్స్‌, వాటర్‌ బాటిళ్లను అందజేశారు. కస్తూర్బా ఎస్‌ఒ గంగాకుమారి పాల్గొన్నారు.