అనంతపురం కలెక్టరేట్ : ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో 99 శాతం నెరవేర్చిన ఘనత రాష్ట్రంలోని ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందని ఏపీ సిఆర్ మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు తెలిపారు. గురువారం సాయంత్రం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి వెళుతూ అనంతపురం నగరంలోని ఆర్‌అండ్‌బి అతిథి గహానికి విచ్చేశారు. ఆయన్ను ఐ అండ్ పిఆర్ డిఐపిఆర్‌ఒ గురుస్వామి శెట్టి కలిసి పుష్పగుచ్చం అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయల సమావేశంలో కొమ్మినేని మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పాలన జరుగుతోందని చెప్పారు. సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హులందరికీ వారి ఇళ్ల వద్దకే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని చెప్పారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు జీవోలో అసంబద్ధ నిబంధనలు సవరించాలని, అర్హులకు న్యాయం చేయాలని పలువురు జర్నలిస్టులు కొమ్మినేనిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన చెప్పారు.