Aug 15,2023 20:46

మాట్లాడుతున్న టివివి ప్రసాద్‌

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తాను ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు టివివి ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 17న నిర్వహిస్తున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మంగళవారం మండలంలోని నరుకూరులో సిఐటియు, ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన జరిగింది. సిఐటియు మండల కార్యదర్శి మారుబోయిన రాజా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రసాద్‌ పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం అధ్యక్షులు రాజా మాట్లాడారు. సిఐటియు మండల గౌరవ అధ్యక్షులు వేగూరు వెంకయ్య, నాశీన పరశురామయ్య, శివ, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ఎం. వెంకట శేషయ్య, అన్నం పుట్టయ్య ఉన్నారు.