
ప్రజాశక్తి - కురుపాం : ప్రజలకు ఇచ్చిన హామీలంటినీ ప్రభుత్వం అమలు చేస్తుందని స్థానిక ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు. మండల కేంద్రంలో గల శివన్నపేట సచివాలయం 2 వద్ద ఆంధ్రప్రదేశ్‌కి జగనే ఎందుకు కావాలి అన్న కార్యక్రమంలో భాగంగా సచివాలయ పరిధిలో గల అతికించిన సంక్షేమ పథకాలు డిస్ ప్లే బోర్డును గురువారం ఆమె ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సచివాలయ పరిధిలో 25 సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా వాలంటరీ వ్యవస్థ ద్వారా, పరోక్షంగా 13 పథకాలు కలిపి ప్రభుత్వం అందిస్తుందన్నారు. కావున రానున్న ఎన్నికల్లో ప్రజలంతా గమనించి ఎవరైతే మీకు మంచి పరిపాలన అందిస్తున్నారు అటువంటి నాయకుడిని ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా వైసీపీ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షితరాజు, ఎంపిడిఒ వివి శివరామప్ప, ఎంపిపి శెట్టి పద్మావతి, జడ్పిటిసి జి.సుజాత, జిల్లా కోఆప్షన్ సభ్యులు షేక్ నిషార్, స్థానిక సర్పంచి జి.సుజాత ఉప సర్పంచ్ షేక్ ఆదిల్, వైసిపి గ్రీవెన్స్ జిల్లా అధ్యక్షులు శెట్టి నాగేశ్వరరావు, వైసిపి వాణిజ్య విభాగాల జిల్లా అధ్యక్షులు అంధవరపు కోటేశ్వరరావు , వైస్ ఎంపిపి బి.అన్నాజీరావు ఎ.రంగారావు, మండల కన్వీనర్ ఐ.గౌరీశంకరరావు, మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ జిలాని, ఎంపిటిసి సభ్యులు వి.బంగారు నాయుడు, టివిఎస్ స్వామియాజులు, అయ్యరకల కార్పొరేషన్ డైరెక్టర్ గవర విజయచంద్రశేఖర్, పంచాయతీ ఇఒ కె. చంద్రశేఖర్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.
సీతంపేట : స్థానిక సచివాలయం-1లో జగనే మళ్లీ సిఎం ఎందుకు కావాలి అన్న కార్యక్రమాన్ని పాలకొండ ఎమ్మెల్యే వి.కళావతి ప్రారంభించారు. సచివాలయంలో లబ్దిదారుల వివరాలతో కూడిన డిస్ప్లే బోర్డును ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపిపి బిడ్డిక ఆదినారాయణ, జడ్పీటీసీ ప్రతినిధి సవర రాము, జడ్పీ కొ ఆప్షన్ సభ్యులు ప్రతినిధి సవర చంద్రశేఖర్, వైస్ ఎంపిపిలు కుండంగి సరస్వతి, మూటక విజయలక్ష్మి, పాలకొండ ఎఎంసి చైర్మన్ హిమరిక మోహన్‌రావు, సర్పంచ్ ఎ.కళావతి, ఎంపిడిఒ కె.గీతాంజలి, సచివాలయం కార్యదర్శి సుదర్శనరావు, వైసిపి నాయ కులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
గరుగుబిల్లి: మండలంలోని పెద్దూరులో గ్రామసచివాలయ కన్వీనర్లు, గృహసారధులు వాలంటీర్లతో ఎపికి జగన్ ఎందుకు కావాలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎపిపి ఉరిటి రామారావు, జెడ్పీవైస్ చైర్మన్ బాపూజీనాయుడు మాట్లాడుతూ గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు తమ శక్తి వంచన లేకుండా పని చేయాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎం.నారాయణమ్మ, వాలంటీర్లు మర్రాపు నాగభూషణ తదితరులు పాల్గొన్నారు.
వీరఘట్టం : స్థానిక సచివాలయం-1లో ఎపి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమంలో ఎంపిపి వెంకటరమణనాయుడు పాల్గొన్నారు. వైసిపి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వివరించారు. కార్యక్రమంలో సర్పంచి పి గౌరమ్మ, జడ్పిటిసి ప్రతినిధి జంపు ఉమామహేశ్వరరావు, ఎంపిడిఒ వై.వెంకటరమణ, మేజర్ పంచాయతీ ఇఒ వి.రామచంద్రరావు, పార్టీ పట్టణ అధ్యక్షులు డి.లలిత కుమారి, వ్యవసాయ సలహా మండల కమిటీ చైర్మన్ కెఎల్ ప్రసాదు, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ బి.లక్ష్మీకాంతం- లక్ష్మీనారాయణ, పిఎసిఎస్ డైరెక్టర్ భోగి మాణిక్య చంద్రశేఖర్, ఎఎంసి డైరెక్టర్ కె.ఆంజనేయులు, మేదర కార్పొరేషన్ డైరెక్టర్ గ్రంధి దుర్గమ్మ- శ్రీనివాసరావు, ఆర్‌డబ్ల్యుఎస్ జెఇ పవన్, ఇఒపిఆర్‌డి నాయుడు, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.