Aug 21,2023 16:25

పల్లెబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి

బి.కొత్తకోట : మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వందశాతం నెరవేర్చిన ఘనత వైసిపిదేనని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన పెద్దతిప్పసముద్రం మండలంలోని ఉప్పరోళ్లపల్లి, మల్లెల, మల్లెల క్రాస్‌ సచివాలయ పరిధిలో నిర్వహించిన పల్లెబాట కార్యక్రమంలో వైసిపి నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, కుల, మత, రాజకీయాలకతీతంగా వాటిని అమలు చేస్తున్న ఏకైక నాయకుడు ఆయనేనని కొనియాడారు. ఇక తంబళ్లపల్లె నియోజ కవర్గంలో గత 40 దశాబ్దాలుగా జరగనటువంటి అభివద్ధిని కేవలం మూడు సంవత్సరాలలో చేసి చూపించామన్నారు.మారుమూల గ్రామాలకు సైతం మౌలిక వసతులు కల్పించామన్నారు.అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యలు పరిష్కరించి, సంక్షేమ పథకాలను సకాలంలో అందజేయాలని, తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిపెట్టాలన్నారు. కార్యక్రమంలో వైసిపి జిల్లా ఉపాధ్యక్షుడు మాజీ ఎంపిపి ఖలీల్‌ అహ్మద్‌, గుడిపల్లి సర్పంచ్‌ గిరిజరఘునాథ్‌, ఎంపిడిఒ శంకరయ్య, నాలుగో సచివాలయం కన్వీనర్‌ కంచి కళ్యాణ్‌ కుమార్‌ రెడ్డి, వైసిపి జిల్లా ప్రచార కార్యదర్శి అయూబ్‌ బాషా, మండల ప్రత్యేక ఆహ్వానితుడు అరుణ్‌కుమార్‌రెడ్డి, నియోజవర్గం సేవాదళ్‌ అధ్యక్షుడు సల్మాన్‌, ఎంపిపి మహమ్మద్‌, జడ్‌పిటిసి శివన్న, సర్పంచులు, టి.సదుం ఎంపిటిసిలు జయలలిత మంజునాథ్‌, సర్పంచులు నాగరత్న భాస్కర్‌నాయుడు, రామకష్ణ,యస్‌ యస్‌ ఫయాజ్‌, పెద్దతిప్పసముద్రం మాజీ సర్పంచులు రియాజ్‌ అలీఖాన్‌, మల్లెల వెంకట్‌, నక్క మహేష్‌, సబ్జీ, అభిలాష్‌ రెడ్డి, సద్దాం,పవన్‌, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.