Nov 06,2023 21:15

పార్వతీపురం: కేక్‌ కట్‌ చేస్తున్న ఎమ్మెల్యే జోగారావు

ప్రజాశక్తి - పార్వతీపురంటౌన్‌ : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నాటి ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను 99 శాతం నెరవేర్చారని స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించి ఈనెల 6నాటికి ఆరేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఎమ్మెల్యే ఆధ్వర్యాన పార్టీ శ్రేణులతో కలిసి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నాడు జగన్‌ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత 99 శాతం మేర నెరవేర్చామ న్నారు. ఈ ప్రభుత్వంలో మీకు లబ్ధి చేకూరినట్టు అనిపిస్తేనే రానున్న ఎన్నికల్లో జగన్‌ను మళ్లీ గెలిపించుకునేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బోను గౌరీశ్వరి, వైస్‌ చైర్మన్‌ యిండుపూర్‌ గుణేశ్వరరావు, పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ మంత్రి రవికుమార్‌, ఎంపిపి మజ్జి శోభరాణి, పార్టీ అధ్యక్షులు బొమ్మి రమేష్‌, వైస్‌ ఎంపిపిలు బి రవి కుమార్‌, సిద్ధ జగన్నాధ రావు, జెడ్‌పిటిసి ప్రతినిధి బలగ నాగేశ్వరరావు, జెసిఎస్‌ కన్వీనర్లు బి.వాసుదేవరావు, గొర్లి మాధవరావు తదితరులు పాల్గొన్నారు.
పాలకొండ : రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితోనే మెరుగైన పాలన జరుగుతుందని శాసన మండలి విప్‌ పాలవలస విక్రాంత్‌ అన్నారు. ప్రజాసంకల్పయాత్ర ప్రారం భమై ఆరేళ్లు పూర్తన సందర్భంగా సోమవారం స్థానిక కార్గిల్‌ పాయింట్‌ దగ్గర వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. ఎమ్మెలే వి.కళావతి మాట్లాడుతూ అన్ని వర్గాలకు అండగా ఈ ప్రభుత్వం ఉందన్నారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపిపిలు కనపాక సూర్య ప్రకాష్‌, అనిల్‌, నగర పంచాయతీ వైస్‌ చైర్మన్‌ పల్లా ప్రతాప్‌, వీరఘట్టం ఎంపిపి దమలపాటి వెంకటరమణ, వెలమల మన్మధరావు, పాలవలస ధవళేశ్వరరావు పాల్గొన్నారు.
భామిని : సిఎం చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా భామినిలోని కొరమ కూడలి వద్ద గల వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద వైసిపి ప్రజా ప్రతినిధులు కేక్‌ కట్‌ చేసి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్‌ తోట సింహాచలం, వైస్‌ ఎంపిపి బోనగడ్డి ధర్మారావు, జెసిఎస్‌ కో ఆర్డినేటర్‌ కొత్తకోట చంద్రశేఖర్‌, జెడ్‌పిటిసి బొడ్డేపల్లి ప్రసాదరావు, నాయకులు ఎ.రఘుపతి నాయుడు, పాల్గొన్నారు.
సాలూరు: సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి గత ఎన్నికల ముందు చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర వైసిపి చరిత్రలో ఓ మైలురాయి లాంటిదని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పువ్వుల ఈశ్వరమ్మ, పట్టణ పార్టీ అధ్యక్షుడు వంగపండు అప్పలనాయుడు, జెసిఎస్‌ కన్వీనర్‌ గిరి, రఘు అన్నారు. ప్రజా సంకల్పయాత్ర ప్రారంభి ంచి ఆరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సోమవారం పట్టణంలోని బోసుబొమ్మ జంక్షన్‌లో వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి నాయకులు కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి జర్జాపు సూరిబాబు, కౌన్సిలర్‌లు రాపాక మాధవరావు, గొర్లి వెంకటరమణ, డిసిఎంఎస్‌ డైరెక్టర్‌ పిరిడి రామకృష్ణ, మాజీ కౌన్సిలర్‌ కె.వెంకటరమణ పాల్గొన్నారు. కురుపాం : స్థానిక వైఎస్సార్‌ విగ్రహం వద్ద ఎంపిపి శెట్టి పద్మావతి ఆద్వర్యంలో కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేశారు. నాలుగున్నరళ్ళ పాలనలో అందించిన సంక్షేమ పథకాలు, పరిపాలనను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి జి.సుజాత, సర్పంచ్‌ జి.సుజాత, ఎంపిటిసిలు బంగారు నాయుడు, స్వామి యాజులు, సంతోషి పాల్గొన్నారు