Jul 22,2023 00:13

చెక్కు అందజేస్తున్న మంత్రి నాగార్జున

ప్రజాశక్తి-భట్టిప్రోలు : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు తుచ తప్పకుండా అమలు చేస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున తెలిపారు. సిఎం జగన్మోహన్‌ రెడ్డి నేతన్న నేస్తం పథకాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని మండల పరిధిలోని ఐలవరం గ్రామంలో లైవ్‌ షో ద్వారా ప్రజలకు చూపించారు. ఈ సందర్భంగా మంత్రి నాగార్జున మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే మన రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. చేనేత కార్మికులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మగ్గంపై నేత నేసే ప్రతి కార్మికునికి ఏడాదికి రూ.24 వేలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలోకి సిఎం బటన్‌ నొక్కి జమ చేస్తున్నారన్నారు. ఈ పథకం ద్వారా ఐదవ విడతగా రూ.20,89,20000 నేడు లబ్ధిదారుల ఖాతాల్లో చేసినట్లు తెలిపారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు మాట్లాడుతూ దేశంలో వ్యవసాయం తరువాత రెండవ అతిపెద్ద రంగం చేనేత రంగమని తెలిపారు. దాన్ని అభివద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అన్ని విధాలా కషి చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర అభివద్ధే థ్యేయంగా జగన్మోహన్‌ రెడ్డి పని చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో బాపట్ల అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ చైర్మన్‌ దేవినేని మల్లికార్జునరావు, జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా, రేపల్లె ఆర్‌డిఒ జగన్నాధం పార్థసారధి, ఎంపిపి డివి.లలిత కుమారి, జడ్‌పిటిసి టి.ఉదరు భాస్కరి, సర్పంచి మాచర్ల కోటేశ్వరరావు,నాయకులు హేమసుందరరావు, శరత్‌, తులసి రంగారావు, బాలాజీ, పిచ్చయ్య శాస్త్రి, మల్లేశ్వరరావు, కర్రా కిషోర్‌ పాల్గొన్నారు.మార్టూరు రూరల్‌ : మగ్గానికి మహర్దశ తీసుకొచ్చి దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలోని నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపడానికి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం అమలు చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే, వైసిపి పర్చూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆమంచి కష్ణమోహన్‌ తెలిపారు. వలపర్లలో వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం లబ్ధిదారులకు ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ చుండి సుజ్ఞానమ్మతో కలిసి ఆయన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమంచి మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేతన్నల అభివద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో నేతన్నల సంక్షేమం కోసం కేవలం రూ. 442 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేతన్నల సంక్షేమం కోసం నాలుగున్నర ఏళ్లుగా రూ.3,706 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా 286 మంది చేనేత లబ్ధిదారులకు రూ.6,86,4000 చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్టూరు తహశీల్దారు సురేష్‌ బాబు,ఎంపిడిఒ తోట కష్ణ కుమారి, డెయిరీ మాజీ చైర్మన్‌ ఉప్పలపాటి చెంగలయ్య, వక్ఫ్‌ బోర్డు జిల్లా కార్యదర్శి గడ్డం మస్తాన్‌ వలి, వైసిపి మండల కన్వీనర్‌ పఠాన్‌ కాలేషా వలి, గ్రామ సర్పంచి తాళ్లూరి బ్రహ్మయ్య,తాటి వెంకటరావు, వలపర్ల వైసిపి నాయకుడు షేక్‌ జాఫర్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.