Oct 16,2023 20:46

పోటీల్లో విజేతలు

హాకి విజేత తిరుపతి సర్కిల్‌ జట్టు

ప్రజాశక్తి - తిరుపతి సిటి
ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్స్‌ ఉద్యోగుల ఇంటర్‌ సర్కిల్‌ హాకీ, బాస్కెట్‌ బాల్‌, షటిల్‌ పోటీల్లో భాగంగా ఈనెల 14 నుంచి జరిగిన హాకీ పోటీల్లో తిరుపతి సర్కిల్‌ మొదటి స్థానంలో నిలిచింది. ఇక కడప సర్కిల్‌, నెల్లూరు సర్కిల్‌ జట్లు సంయుక్తంగా ద్వితీయ స్థానంలో నిలిచాయి. అదేవిధంగా షటిల్‌ విభాగంలో బాస్కెట్‌ బాల్‌ పోటీల్లో రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు (ఆర్‌ టి పి పి) జట్టు మొదటి స్థానంలోనూ, డాక్టర్‌ నార్ల తాతారావు థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (డాక్టర్‌ ఎన్‌ టి టి పి ఎస్‌) జట్టు ద్వితీయ స్థానంలోనూ, ఏపీఎస్పీడీసీఎల్‌ నెల్లూరు సర్కిల్‌ జట్టు తతీయ స్థానంలోనూ నిలిచాయి. షటిల్‌ బ్యాడ్మింటన్‌ విభాగంలో ఏపీ జెన్కో కష్ణపట్నం జట్టు మొదటి స్థానంలోనూ, ఆర్టిపిపి ద్వితీయ స్థానంలోనూ, ఏపీఎస్పీడీసీఎల్‌ నెల్లూరు సర్కిల్‌ జట్టు తతీయ స్థానంలోనూ నిలిచాయి. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో విజేతలకు హౌల్‌ టైం ఉమెన్‌ డైరెక్టర్‌ పి.బి. శశికళ చేతుల మీదుగా ట్రోఫీలు, సర్టిఫికెట్లను బహుకరించారు. ఈ కార్యక్రమంలో చీఫ్‌ జనరల్‌ మేనేజర్లు జె. రమణా దేవి, డి.ఎస్‌. వరకుమార్‌, డీ.వి. చలపతి, స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ కుమార వడివేలు, ఎస్పీడీసీఎల్‌ తిరుపతి స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ యం. కష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి వాసుదేవరెడ్డి, స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ ప్రతినిధులు వాసురెడ్డి, పురుషోత్తం, లీలారామ్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు అమర్‌ బాబు, పద్మనాభ పిళ్ళై, శ్రీనివాసమూర్తి, శ్రీనివాసులు పాల్గొన్నారు.
పోటీల్లో విజేతలు