Oct 13,2023 16:15

ప్రజాశక్తి-కోట : కోట మండలంలోని డాక్టర్ బీ ఆర్ అంబెడ్కర్ గురుకుల పాఠశాల, కళశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని డాక్టర్ బీఆర్ అంబెడ్కర్ గురుకుల ప్రిన్సిపాల్ అద్దూరి.వెంకటేశ్వర్లు అన్నారు. ఈ సందర్బంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ తమ కళాశాల, పాఠశాలలోని విద్యార్థులు అందరు కలిపి 81 మంది విద్యార్థుల రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారని తెలిపారు. ఈ మేరకు కోకో, అథ్లెటిక్స్,సాప్ట్ బాల్, వాలీబాల్, రగ్బీ, నెట్ బాల్, బేస్ బాల్, కబడ్డీ, త్రోబాల్, రెజ్లింగ్, చెస్, టెన్నీ కాయిట్ అందులో ఇద్దరు రెజ్లింగ్ లో జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్నారని తెలిపారు. ఈ సందర్బంగా తిరుపతి జిల్లా సమన్వయకర్త డాక్టర్ వి.జయభారతి పాఠశాల, కళశాల ప్రధానాచార్యులు అద్దూరి.వెంకటేశ్వర్లు కలిసి విద్యార్థులను అభినందించారు. అంతే కాకుండా ప్రధానంగా విద్యార్థులకు తర్ఫిదును ఇచ్చిన వ్యాయామ అధ్యాపకులు పి.డి.వి.రాజ్ కుమార్, పి.ఇ.టి.డి. రమణయ్యలను కూడా అభినందించారు.