Sep 21,2023 10:14

ప్రజాశక్తి-మండపేట : స్థానిక సంగమేశ్వర కాలనీలోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మహాకవి, సంఘసంస్కర్త, గురజాడ అప్పారావు 161వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులు మానవహారం నిర్వహించి దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులే అని నినాదించారు. గురజాడ అప్పారావు వేషధారణలో విద్యార్థి అందర్నీ ఆకట్టుకున్నాడు. కార్యక్రమంలో  ఉపాధ్యాయులు చిట్టూరి వెంకట శ్రీధర్, శేషారత్నం, విద్యార్థులు పాల్గొన్నారు.