Aug 04,2021 15:24

చెన్నై : గ్రనేడ్లను చేతితో విసరకుండా తుపాకితోనే ప్రయోగించే సరికొత్త ఆయుధం రూపొందింది. భద్రతా బలగాలు దూరం నుంచే తమ ప్రత్యర్థులపై దాడి చేసేందుకు అనువుగా ఈ ఆయుధాన్ని తిరుచ్చిలోని ఆయుధ కర్మాగారంలో రూపొందించారు. ఈ కొత్త ఆయుధాన్ని కర్మాగారం జనరల్‌ మేనేజర్‌ సంజరుద్వివేది పరిచయం చేశారు. 'ఏకే 47'తో పాటు పలురకాల తుపాకుల్లో అమర్చేలా 40గీ46 'అండర్‌ బ్యారెల్‌ గ్రనేడ్‌ లాంచర్‌' ను రూపొందించినట్లు తెలిపారు. 1.6 కిలోల బరువున్న ఈ ఆయుధం 400 మీటర్ల దూరం వరకు లక్ష్యాలను ఛేదించగలదని అన్నారు. అలాగే, ఒక సైనికుడు 'టీఏఆర్‌/ఏకే-47' తూటాలతో పాటు హ్యాండ్‌ గ్రనేడ్లు ప్రయోగించి శత్రువులను ఎదుర్కోవచ్చని అన్నారు. ఈ కొత్త ఆయుధాన్ని ఒక నిముషంలోనే 'టీఏఆర్‌/ఏకే-47' తుపాకీలో అమర్చి, విడతీయవచ్చని చెప్పారు.