- ముఖ్యఅతిథిగా పాల్గొన్న గూడూరు రూరల్ ఎస్సై బ్రహ్మనాయుడు
ప్రజాశక్తి - గూడూరు : గూడూరు పట్టణంలోని తూర్పు వీధిలోనీ పూల తోట ప్రాంతంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గూడూరు రూరల్ ఎస్సై బ్రహ్మనాయుడు మాట్లాడుతూ బాల్య దశ నుండి విద్యార్థులలో నైపుణ్య విలువలు క్రమశిక్షణ దేశం పట్ల గౌరవం కలిగి ఉండాలని, విద్యార్థులను ప్రోత్సహించే విధంగా ఇలాంటి గ్రాడ్యుయేషన్ డీలర్ నిర్వహించడం చాలా అభినందనీయమని వారు తెలియజేశారు, తల్లిదండ్రులు కూడా విద్యార్థులకు ప్రోత్సాహం ఇచ్చి విద్యాభ్యాసంలో ఇంకా ముందడుగు వేసే విధంగా ఉండాలని ఆయన తెలియజేశారు, మరియు పాఠశాల కమిటీ కార్యదర్శి శ్రావణా జ్యువెలర్స్ అధినేత సేగు ప్రసాద్ మాట్లాడుతూ మన పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థులకు విద్యాభ్యాసంలో చాలా తోడ్పాటు ఉంటుందని, విద్యార్థులకు కావాల్సింది విద్యలో ప్రోత్సాహమేనని వారు తెలియజేశారు , మరియు ముఖ్య వక్త నెల్లూరు విభాగ్ ప్రచార ప్రముఖ వేములపాటి రవి మాట్లాడుతూ శిశుమందిర్ పాఠశాలలు దేశవ్యాప్తంగా ఉన్నాయని వాటిలో దేశభక్తి క్రమశిక్షణ విద్యాభ్యాసం నేర్పిస్తూ విద్యార్థులను ఈ దేశానికి ఉపయోగపడే వ్యక్తులుగా తయారు చేస్తున్నాయని ఆయన తెలియజేశారు, అనంతరం విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా సర్టిఫికెట్లను అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రంగనాయకులు ఉపాధ్యాయులు శోభ నదియా , లక్ష్మీ , తల్లిదండ్రులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు










