- నేదురుమల్లి రామ్ కుమార్
- దేశంలో ఎక్కడ లేని విధంగా విద్యా రంగంలో అనేక సంస్కరణలు అమలు : జిల్లా కలెక్టర్
- పేద మధ్యతరగతి విద్యార్థులకు అండగా మన ముఖ్యమంత్రి జగనన్న : డా.శిరీష
ప్రజాశక్తి-తిరుపతి సిటీ : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చదువే ఆస్తిగా భావించి పేద పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ద పెట్టి నాడు- నేడు పథకంతో నిధులు ఖర్చు చేయడంతో కార్పోరేట్ విద్య కన్నా ప్రభుత్వ బడులలో చదువుతున్న వారు మంచి రిజల్ట్స్ తో పాస్ అవుతున్నారని బోర్డు అఫ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ త్రూ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎ.పి చైర్మన్ ఎన్ రామ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం ఉదయం స్థానిక శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో జిల్లా స్థాయి జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో ఎన్. రామ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిదిగా, జిల్లా కలెక్టర్ కె . వెంకటరమణ రెడ్డి, సభాధ్యక్షులుగా, నగర పాలక మేయర్ డాక్టర్ శిరీష హాజరై, 2022-23 విద్య సంవత్సరంలో ఇంటర్, 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన మొదటి 3 ర్యాంకు ల సాదించిన వారికి జగనన్న ఆణి ముత్యాల బహుమతుల ప్రధానంలో పాల్గొన్నారు.
బోర్డు అఫ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ త్రూ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎ.పి చైర్మన్ ఎన్.రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చదువే ఆస్తిగా నమ్మి విద్యరంగంపై అనేక పథకాలు అమలు చేసి కార్పోరేట్ దీటుగా ప్రభుత్వ పాటశాలలను తీర్చిదిద్దారని అన్నారు. నేడు విద్యార్థులు ప్రభుత్వ బడుల లో విద్య బోదన తక్కువేం కాదని, ప్రతిభలో తగ్గేదేలే అన్న విధంగా ప్రతిభ కనబరిచారని అన్నారు. పేద మధ్య తరగతి కుటుంబాల తల్లితంద్రుల్లు తమ పిల్లలకు ప్రభుత్వ బడులలో సీట్లు ఇప్పించాలని అనేక మంది వస్తున్నారని అందులో ఏఒక్కరు కూడా ప్రైవేటు విద్య సంస్థలలో సీటు కావాలన్నా వారు ఒక్కరూ లేరని దీనిని బట్టి మన రాష్ట్రంలో అధ్యాపకులు, ఉపాధ్యాయులు బోధన విధానం వల్ల ప్రతిభ తెలుస్తున్నదని అన్నారు. జిల్లాలో అన్ని పాటశాలలకు, కళాశాలలకు చెందిన 941 మంది విద్యార్థులు జగనన్న ఆణిముత్యాలు అందుకోవడం సంతోషమని అన్నారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యారంగంలో సంస్కరణలు అమలుతో గత 2 సంవత్సరాలుగా మంచి ఫలితాలు వస్తున్నాయని అందుకు కారణం విద్యరంగంలో సంస్కరణలు అమలు చేయడం, నాడు –నేడు అమలు చేసి 10 రకాల సౌకర్యాల కల్పన, మరుగు దొడ్డ్లు నిర్మించి రన్నింగ్ వాటర్ ఏర్పాటు, మంచి వాతావరణం కల్పించడం జరిగిందని అన్నారు. నగర పాలక మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి నవరత్నలకు ప్రాధాన్యతనిస్తూ పేద, మధ్య తరగతి పిల్లల విద్యకు, ఉన్నత విద్యకు ప్రత్యేక స్థానం కల్పిస్తూ అమ్మఒడి, విద్యకానుక, విద్య దీవెన, వసతి దీవెన, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ క్లాసు రూమ్ వంటివి ఏర్పాటు చేసి విద్యలో అనేక మార్పులు తీసుకువచ్చారని, నేడు జగనన్న ఆణి ముత్యాల పేరుతో ప్రతి పాటశాలలో ఎస్.ఎస్. సి, ఇంటర్ పరీక్షలలో ప్రతిభ కనబరించిన మొదటి ముగ్గురని ఎంపిక చేసి వారి తల్లితండ్రులను, విద్య బోదన చేపట్టిన గురువులను కలిపి ఒకే వేదిక సన్మానించడం సంతోషంగా ఉందని అన్నారు. సమావేశ అనంతరం ఎస్.ఎస్.సి, ఇంటర్ పరిక్షలలో జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన 52 మంది విద్యార్థులకు మొదటి బహుమతి రూ. 50 వేలు, రెండవ బహుమతి రూ. 30 వేలు, మూడవ బహుమతి రూ. 15 వేలు నగదు, ప్రశంసా పత్రం, మెడల్ లను తల్లితండ్రుల, గురువుల సమక్షంలో విద్యార్థులకు అందించి, ఘనంగా సన్మానించి, ఆశీర్వదించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్ స్వాగతోపన్యాసం చేపట్టగా డిప్యూటి ఎడ్యుకేషన్ అధికారులు, ఎం.ఇ.లు, జగనన్న ఆణి ముత్యాలు అందుకున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు , గురువులు పాల్గొన్నారు.










