ప్రజాశక్తి-చిలకలూరిపేట : ట్రామాకేర్ (కేవలం ప్రమాదాలు జరిగితే అత్యవసర సేవలందించే హాస్పిటల్స్) హాస్పిటల్ సౌకర్యం ప్రస్తుత పరిస్థితుల్లో పట్టణానికి చాలా అవసరము. ప్రమాదాలు జరిగితే అధునాత న వైద్య సేవల కోసం 40 కి.మీ.దూరంలో ఉన్న గుంటూరు పోవాల్సి రావటంతో వైద్యం సరి అయిన సమయానికి అందక మధ్యలోనే అనేక మందికి ప్రాణలు పోవటం జరుగుతుంది. వాన రాకడా.. ప్రాణం పోకడ చెప్పలే మన్నట్లు... కొద్దీ రోజుల క్రితం స్థానిక అడ్డరోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థిని, విద్యార్థులైన వజీతా ప్రాథమిక వైద్యం అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు పోయో దారిలో ప్రాణం పోవటం.. మరొక విద్యార్థి కట్టా కృష్ణ మృత్యవుతో పోరాడి గుంటూరు హాస్పిటల్ లో ప్రాణాలు విడిచిన సంగతి విదితమే జగనన్న సురక్ష, జగనన్న ఫామిలీ అధకం, పల్లెల్లో విలేజీ క్లినిక్ లు తదితర వైద్య రంగంలో అనేక అధునాతన పథకాలు, మార్పు లు వచ్చాయి. కానీ ఇందులో పూర్తిగా ట్రామా కేర్ అవసరాన్ని వైద్య శాఖ, అధికారులు మరచారంటున్నారు. ముఖ్యంగా అటు మేదరమెట్ల నుంచి ఇటు బోయపాలెం వరకు ఉన్న షుమారుగా 60,65 కి.మీ దూరంలో పొరపాటున ప్రమాధాలు జరిగితే వై ద్యం కోసం అటు ఒంగోలు..ఇటు గుంటూ రులో తప్ప ట్రామా కేర్ హాస్పిటల్స్ మధ్య లో ఎక్కడ లేవు. జాతీయ రహదారి కావటంతో విజయవాడ నుంచి బెంగుళూర్ కు, మద్రాస్ వర కు అటు నుంచి విజయవా డ వరకు నిత్యం అనేక రకాలైన అతి వేగం కలి గిన వాహనాల్లో ప్రజలు ప్రయాణాలు చేస్తు న్నారు. ముఖ్యంగా అతి వేగం గలిగిన వా హనాలు కావటం దానికి అనుగుణంగా రో డ్లు మరియు ఇతర వేగ నియంత్రణ,అదు పు చేసే సౌకర్యాలు లేక పోవటంతో నిత్యం ఎక్కడో ఒక చోట ప్రమాధాలు అదే వేగంతో జరుగు తున్నాయి.మేదరమెట్ల ఆ ప్రాంతా లల్లో ప్రమాదాలు జరిగితే అటు ఒంగోలు షుమారుగా 30 కి.మీ వైద్యం కోసం వ్యళ్తు న్నారు. అది దాటితే గుంటూరు పోయో వరకు మధ్యలో 65, 70 కి.మీ లోపు ట్రామా కేర్ సౌకర్యాలతో కూడిన హాస్పిటల్స్ లేవు. కేవలం ప్రాథమిక చికిత్స కోసం మాత్రమే చిలకలూరి పేట పట్టణములో ప్రభుత్వ ఆ సుపత్రి ఉంది. అది కూడా రోడ్డు ప్రక్క లేదు. పట్టణములో గల అడ్డరోడ్డు నుంచి హాస్పిట ల్ కు 1300 మీటర్లు దూరములో 10,13 నిమిషాల సమయం పట్టేంత దూరములో ఉంది. అంత దూరంలో ఉన్న ఈ హాస్పిటల్కి పోయిన సరైన వైద్య సౌకర్యాలు లేక తిరిగి గుంటూరు పోవాల్సి వస్తే దాదాపు 25, 30 నిమిషా లు ట్రాఫిక్ లో సమయం పోయినట్లే.. ఒక్క సెకండ్ కాల పరిమితిలో సరైన వైద్యం అందక వందల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. చిలకలూరిపేట పట్టణములో ఉన్న ఈ100 పడకల హాస్పిటల్ అడ్డరోడ్డు నుంచి షుమారుగా 1.300 కి.మీ.దూరంలో ఉంది. అదే అడ్డరోడ్డు నుంచి ఈ హాస్పిటల్స్ కు వెళ్లాలంటే షుమారుగా 10,12 నిమిషాల సమయం పడుతుంది. ఈ హాస్పిటల్ జాతీయ రహదారి ప్రక్కనే ఉంటే ప్రాథమిక వైద్యం చేయిచుకుని వెంటనే మెరుగైన వైద్యం కోసం గుంటూరు పోతే కొంతలో కొంత అయిన ప్రాణాలు దక్కే అవకాశం ఉంది. .ప్రధాన రహదారి ప్రక్క నే ఓగేరు వాగు వద్ద నుంచి గణపవరం వద్ద గల కుప్పగుంజి వాగు మధ్యలో ఈ డ్రామా కేర్ హా స్పటల్ నిర్మిస్తే ప్రమాధాలు జరిగిన కొద్దీ సమ యానికే ప్రతి ఒక్కరికి వైద్యం అందే అవకాశం ఉంటుంది. ఈ ట్రా మా కేర్ హాస్పిటల్కి షుమారుగా 20 సెంట్లు స్థలంలో 3 కోట్లతో రూపా యల ఖర్చుతో నిర్మించ వచ్చునని మేధావులు, డాక్టర్లు అంటున్నారు. దీనిలో షుమారుగా 12 మంది డాక్టర్లు అవసర మౌతారని అందులో 6 ఎం. బి.బి.ఎస్.వారు అయితే మిగిలిన వారు 2 ఆర్థోపెడిక్ సర్జిన్లు, ఇద్ద రు జనరల్ సర్జన్ లు, ఇద్దరు మత్తు డాక్టర్లు కావలసిన అవసరం ఉంటుం దంటున్నారు. అంతే కాకుండా సుమారు 70 మంది స్టాఫ్ అవసర మౌ తారని డాక్టర్లు,మేధావులు అంటు న్నారు. హాస్పటల్ నిర్మిస్తే ఎంతో మం దికి ప్రాణాలు కాపాడవచ్చు అంటున్నారు. దీని చుట్టూ ప్రక్కల అనేక వందల మందికి ప్రాణధా నం తో పాటు అనేక మందిల ఇతరులకు జీవనోపాధి కల్పించిన వారు అవతా రంటు న్నా రు. ఇప్పటికి అయిన జిల్లా ఉన్నతా ధికారులు, వైద్య శా ఖ వారు ఈ విషయమై ఆలోచించి వెంటనే తగు చర్యలు తీసుకుని ప్రధాన రహదారి ప్రక్కనే హాస్పిటల్ నిర్మిస్తే వందల మందికి ప్రాణాలు కాపాడిన వారౌతారని ప్రజలు అంటున్నా రు.










