ప్రజాశక్తి-యర్రావారిపాలెం(తిరుపతి): గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన ఎర్రవారిపాలెం మండలం చింతగుంట గ్రామపంచాయతీ పసుపులేటివారిపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. ఈ ఘటనపై వివరాల ప్రకారం.. ఉదయమాణిక్యం జెడ్‌పి స్కూల్ ఉపాధ్యాయుడు రమేష్‌కు గుండెపోటు రావడంతో చికిత్స నిమిత్తం తిరుపతి సిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆయన అక్కడ చిక్తిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న టిడిపి నాయకులు పులివర్తి సుధారెడ్డి స్విమ్స్ ఆసుపత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఉపాధ్యాయుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్వగ్రామంలో బుధవారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.










