Nov 22,2023 11:30

పరమరిబో : దక్షిణ అమెరికా దేశమైన సూరినామ్‌లో అక్రమ బంగారు గని సోమవారం కూలిపోవడంతో 10 మంది మరణించారని అధికారులు తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే గ్రామీణ దక్షిణ ప్రాంతంలో గల గని వద్దకు పోలీసులు, మిలటరీ అధికారులు, సహాయక సిబ్బంది చేరుకున్నారు. బంగారం కోసం తవ్వకాలు జరిపేందుకు గని కార్మికులు తమ స్వంతంగా సొరంగాలు నిర్మించుకుంటున్నట్లు తెలుస్తోందని అధికారులు చెప్పారు. సూరినామ్‌లో ఈ పరిస్థితి సర్వ సాధారణంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ నెలకొన్న పరిస్థితులను అదుపులోకి తీసుకురావడం చాలా ముఖ్యమన్నారు. ప్రభుత్వ బడ్జెట్‌ సమావేశంలో ప్రసంగిస్తుండగా, ఈ విషయం తెలియడంతో వెంటనే ఇక్కడకు రావాల్సి వచ్చిందని చాన్‌ శంతోఖి చెప్పారు. సూరినామ్‌లో బంగారు గనులు చాలా ఎక్కువ. ఇటువంటి గని తవ్వకాల్లో అమెరికా, కెనడా కంపెనీలకు భారీగా పెట్టుబడులు పెడుతూ వుంటాయి.