
ప్రజాశక్తి-బాపట్ల : ప్రపంచ పర్యాటక దినోత్సవం సంధర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంసృతిసమితి వారి ప్రొత్సాహంతో ఫోటోగ్రఫీ అకాడమి ఆఫ్ ఇండియా మరియు ఇండియా ఇంటర్నెషనల్ ఫొటోగ్రాఫిక్ కౌన్సిల్ విజయవాడ వారు సంయుక్తంగా సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సంధర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్టంలో నిర్వహించిన ఛాయాచిత్ర పోటిలో బాపట్ల జిల్లా బాపట్ల మండలం ముత్తాయపాలెంకు చెందిన ఫోటోగ్రాఫర్ పి.వి.యస్.నాగరాజుకు, ఆదర్శనగర్ కు చెందిన ఫోటోగ్రాఫర్ సంగాని ఏడుకొండలకు, నిజాంపట్నంకు చెందిన ఫోటోగ్రాఫర్ డబ్బకుటి శ్రీనివాసరావుకు, వీరి ముగ్గురకు ప్రతిభ పురస్కార్ అవార్డ్ మరియు బంగారు పథకాలు లభించాయి. ఈ అవార్డు ను 27-09-2023న బుదవారం బాలోత్సవభవన్ విజయవాడ లో జరిగిన అవార్డు ప్రధానోత్సవంలో అడిషనల్ సిసిఎల్ఎ కాం సెక్రెటరీ, సేర్ప్ సిఈఓ & డైరెక్టర్, AP స్టేట్ మైనారిటీస్ వెల్ఫేర్ A.Md Imtiaz, IAS చేతుల మీదగా అందుకున్నారు. ఈ కార్యక్రమములో ఫోటోగ్రఫీ అకాడమి ఆఫ్ ఇండియా పౌండర్ మరియు చైర్మెన్ తమ్మా శ్రీనివాసరెడ్డి, ప్రెసిడెంట్ వెంకటరమణ, గోళ్ళ నారాయణ , తదితరులు పాల్గొన్నారు. బాపట్ల ఫోటోగ్రాఫర్స్ వీరిని అభినందించారు.