Apr 17,2023 16:47
  • హౌస్ అరెస్టుల పేరుతో తమ నాయకుడును ఇబ్బందులుకు గురి చేస్తే పోలీస్ స్టేషన్ ముట్టడిస్తామన్న మహిళలు.

ప్రకాశక్తి-రాజవొమ్మంగి : గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావును సోమవారం లోదొడ్డి పంచాయతీ కేశవరంలో తన ఇంటి వద్ద హౌస్ అరెస్ట్ చేసి పోలీసులు నిర్బంధించారు. అడ్డతీగల మండలం వేటమామిడి, పంచాయతీలో, ఎమ్మెల్యే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యంలో సోమవారం ఉదయమే గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు, లోతా రామారావుని పోలీసులులో దొడ్డిలో హౌస్ అరెస్ట్ చేశారు,తరచూ తనని పోలీసులు అరెస్టులు  పేరుతో ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారని లోతా  రామారావు పోలీసులను ప్రశ్నించారు. బోయ వాల్మీకి, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానంపై ఆదివాసీలు అడిగితే సమాధానం చెప్పలేని ఎమ్మెల్యేలు, వైసీపీ ప్రజా ప్రతినిధులు అక్రమ అరెస్టులు చేయటం పిరికిబంద చర్య అన్నారు. ఈ విషయంపై గ్రామ మహిళలు పోలీసులు తీరుపై మండిపడ్డారు. తమ నాయకుడు లోతా రామారావును హౌస్ అరెస్టులు పేరుతో గృహనిర్బంధం చేసి ఇబ్బందులకు గురి చేస్తే పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేస్తామని  హెచ్చరించారు.