- ఆదివాసీ గిరిజన సంఘం జిల్లాకార్యదర్శి పులి.సంతోష్ కుమార్
ప్రజాశక్తి-విఆర్ పురం : జూలై 7న కూనవరంలో అనంతబాబు సభ వలన పోలవరం నిర్వాసితులకు కానీ ఈ ప్రాంతప్రజానీకానికి కానీ ఒరిగేది ఏమిలేదని మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆయన ఎమ్మెల్యేగా పెట్టే బినామిలను గెలిపించుకోవటానికే ఈ సభ అని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పులి సంతోష్ కుమార్ విమర్శించారు. శుక్రవారం నాడు రేఖపల్లిలో ఈ సిరిమల్లిరెడ్డి అధ్యక్షతన జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో పులి.సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల్లో 1 లక్షా 15 వేలు ఇచ్చిన భూములకు 5 లక్షలు, ఆర్&ఆర్ 10 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఈ ప్రాంత నిర్వాసితులు మర్చిపోలేదని ఎక్కడ ఇచ్చారో చెప్పాలన్నారు.గత సంవత్సరం వరదలు వచ్చి ప్రజలంతా బిక్కు బిక్కు మంటూ జీవనం సాగిస్తుంటే ఏ మూలన కూర్చున్నాడో చెప్పాలన్నారు. వారు గెలిచి హత్యలు చేస్తూ.. స్మగ్లింగులు చేస్తూ... అడవిని అమ్ముకుంటూ కేసులైతే అధికారాన్ని ఉపయోగించి ఎలా బయటకు పడాలని చూసారు తప్ప ప్రజాసమస్యలపై పనిచేసింది ఎక్కడ లేదని ఎద్దేవా చేశారు. ఆదివాసీలకు ఉద్యోగాలు రాకుండా జి.ఓ నెం.3 ను రద్దు చేసినపుడు ఆనంతబాబు నోరు ముగబోయిందా? అని....బోయ వాల్మీకీలని ఎస్.టి జాబితాలో ఈ జగన్ ప్రభుత్వం కలిపి ఆదివాసీల జీవనమనుగడకే పెద్ద అన్యాయం చేసినపుడు ఆనంతబాబు నోరు, చేతులు, కాళ్ళు పనిచేయలేదా? అని ప్రశ్నించారు. అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి పనులన్నీ మూలన పడి రోడ్లు లేకుండా ప్రజలు అవస్థలు పడుతుంటే... అధిక ధరలతో ప్రజలు బెంబేలెత్తి పోతుంటే.... మరోపక్క నిరుద్యోగ యువత ఉద్యోగాలు లేక అవస్థలు పడుతుంటే ఈ ప్రాంతం నుంచి గెలిచిన ఎమ్మెల్యే కానీ, ఎం.పి కానీ, ఈ ఆనంతబాబు కానీ ఏ జపం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రజానికం ఆలోచించాలని ఈయన ప్లేక్షీల సోయింగ్ సభ వలన ప్రజలకు ఒరిగేది ఏమి లేదని ఆయన అన్నారు. ప్రజలంతా ఈ సభను బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకులు కారం.నాగేష్, బాబు.బొర్రయ్య, పూనెం.ప్రదీప్ కుమార్,ఇర్పా అజయ్, పులి.బొజ్జి, కారం.సుందరయ్య, రేగులపాడు సర్పంచ్ శంకర్, కారం.ధర్మరాజు కార్యకర్తలు, ప్రజానికం పాల్గొన్నారు.










