Aug 20,2023 22:03

ఘోర రోడ్డు ప్రమాదం

ప్రజాశక్తి-చెన్నూరు
మండంలోని కడప-కర్నూలు జాతీయ రహదారి గోసుల కల్యాణ మండపం సమీపంలో ఆంధ్రస్పైస్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. తండ్రి కర్మకాండకు వెళ్లి వస్తూ మృత్యువాత పడ్డారు. మృతులంతా తెలంగాణా వాసులు. క్షతగ్రాతులను చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సమాచారం మేరకు వివరాలు..
తెలంగాణా రాష్ట్రంలోని ఖైరతాబాద్‌కు చెందిన కొండేటి కృష్ణ తండ్రి ఇటీవల తిరుపతిలో మృతిచెందారు. ఆయన కర్మకాండల కోసం కృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతికి బయలు దేరారు. కార్యక్రమం పూర్తి చేసుకుని ఆదివారం ఖైరతాబాద్‌కు కారులో తిరుగుపయనమయ్యారు. మండలంలోని కడప-కర్నూలు జాతీయ రహదారి ఆంధ్రస్పైస్‌ వద్దకు రాగానే చెట్టుకింద నిలబడి ఉన్న తమిళనాడకు చెందిన ఉప్పులోడు లారీని వెనుకభాగం నుంచి కారు వేగంగా ఢకొీంది. ఆ సమ యంలో లారీ డ్రైవర్‌ వంట చేసుకుంటు ఉండగా కారు లారీ కిందకు పూర్తిగా దూసు కుపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కొండేటి కృష్ణ (48), అతని అత్త పద్మావతి (60), కుమారుడు రిషి (15) ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు. కాగా మృతుడి భార్య విజయవాణి, కుమార్తె నిహారిక తీవ్రంగా గాయ పడ్డారు. సమాచారం తెలియగానే ఎస్‌ఐ శ్రీనివా సులురెడ్డి తమ సిబ్బందితో హుటాహుటీనా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. లారీ కింద ఇరుక్కున కారును వెలికి తీశారు. గాయపడిన క్షతగాత్రులను 108 వాహనంలో చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. మృతుడి కుమారుడు పదవ తరగతి చదువుతున్నాడు. కుమార్తె ఎంసెట్‌ లాంగ్‌టర్మ్‌ (మెడిసిన్‌) కోచింగ్‌ తీసుకుంటున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందడంతో ప్రమాద సంఘటన స్థలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.