Aug 10,2023 23:16

పిడుగురాళ్లలో జెండావిష్కరణ చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా విలేకర్లు : ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యుటిఎఫ్‌) 50వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల జెండాలను ఆవిష్కరించారు. ఇందులో భాగంగా గురువారం పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలోని కార్యాలయం వద్ద జెండాను జిల్లా అధ్యక్షులు పి.ప్రేమ్‌కుమార్‌, పిడుగురాళ్లలోని ప్రాంతీయ కార్యాలయం వద్ద జిల్లా ప్రధాన కార్యదర్శి జి.విజయసారధి ఆవిష్కరించి మాట్లాడారు. 1974లో యుటిఎఫ్‌ ఆవిర్భవించిందని, అప్పటి నుండి ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ, సమస్యల పరిష్కారం, ఉపాధ్యాయుల హక్కుల కోసం అనేక ఉద్యమాలు చేసిందని చెప్పారు. పోలీస్‌ నిర్బంధాలను నాయకులు ఎదుర్కొన్నారని, హక్కుల కోసమే కాకుండా బాధ్యతలనూ ముఖ్యమైన కార్యాచరణగా నిర్వహించారని చెప్పారు. ఈ ఒరవడిని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. ప్రభుత్వాల విధానాల వల్ల ప్రాథమిక పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. యుటిఎఫ్‌ సామాజిక స్పృహలో భాగంగా పీడిత ప్రజల కోసం అంబలి కేంద్రాలు అన్నదాన, కార్యక్రమాలు, వైద్య సేవలు, కరోనా కష్టకాలంలో రూ.లక్షల విరాళాలను అందించడంలో ముందు పీఠిన ఉందని గుర్తు చేశారు. కార్యక్రమంలో నాయకులు ఎం.మోహన్‌రావు, ఎ.భాగేశ్వరిదేవి, జె.వాల్యానాయక్‌, ఎం.సుందర్‌రావు, చంద్రశేఖర్‌, వెంకటేశ్వరరావు, వై.శ్రీనివాసరావు, మల్లికాబేగం, ఉషాసౌరిరాణి పాల్గొన్నారు. పిడుగురాళ్లలోని ప్రాంతీయ కార్యాలయం వద్ద జెండాను ఆవిష్కరించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జి.విజయ సారథి మాట్లాడారు. ఖాసిం పీరా, జమాల్‌, జి.ప్రసాద్‌, సాంబశివరావు, శ్రీనివాసరావు, చంద్రశేఖర్‌, పి.నాగేశ్వరరావు, ఎం.జాకబ్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మాచర్లలోని పెన్షనర్స్‌ హాలు వద్ద జెండాను ఆవిష్కరించారు. పెన్షనర్స్‌ నాయకులు మాట్లాడిన అనంతరం యుటిఎఫ్‌ సీనియర్‌ నాయకులు గాలిబ్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయ సంఘాల్లో అతి పెద్దదైన యుటిఎఫ్‌ విద్యారంగం, ఉపాధ్యాయుల సమస్యలపై ఎనలోని కృషి చేస్తోందని చెప్పారు. నాయకులు నాసర్‌రెడ్డి, శాంతాబాయి, జెవికెస్‌ ప్రసాద్‌, పి.రామారావు, నాగరాజు, కేశవరెడ్డి పాల్గొన్నారు. దాచేపల్లిలోని కార్యాలయం వద్ద జెండాను ఆవిష్కరించారు. జిల్లా కార్యదర్శి వి.నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలపై నిత్యం యుటిఎఫ్‌ పోరాడుతోందని చెప్పారు. మండల ప్రధాన కార్యదర్శి టి.ఆనంద్‌కుమార్‌, నాయకులు ఎల్‌.వాసుదేవ్‌, మస్తాన్‌వలి, జి.శ్రీనివాసరావు, కె.మోజేష్‌, పి.రాజారావు, సాగర్‌బాబు పాల్గొన్నారు.