వీరఘట్టం: మండల కేంద్రంలోనే కోమటివీధి పాఠశాల ఆవరణలో గురువారం యుటిఎఫ్ 50వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ సీనియర్ నాయకులు ఎస్.మహేష్, ఎస్.రాజేశ్వరి పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎం.పైడిరాజు, కె.గోవిందరావు, బి.దుర్గాప్రసాద్, కె.గౌరు నాయుడు, వి.శ్రీధర్, వి.అన్నాజీ రావు, ఎ.చంద్రమోహన్, కె.గోవిందరావు, వి.నరసింగరావు, పి.మురళీకృష్ణ, దివాకర్, మల్లేశ్వరరావు, తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
భామిని : యుటిఎఫ్ 50వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని భామిని ప్రాథమిక పాఠశాలలో యుటిఎఫ్ పతాకాన్ని మండల శాఖ అధ్యక్షులు ఈగల తిరుపతిరావు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా యుటిఎఫ్ అధ్యక్షులు మాట్లాడుతూ విద్యా రంగం పరిరక్షణకు, ఉపాధ్యాయులు సమస్యలు పరిస్కారానికి యుటిఎఫ్ కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి కడ్రాక ప్రసాద్, కె. క్రాంతి కుమార్, పంటల తిరుపతిరావు, లుడాతచిన్, ఎన్. రమేష్, టి. వెంకటరమణ వున్నారు.










