Jul 02,2023 01:32
వ్యవసాయ అధికారికి సన్మానం

ప్రజాశక్తి-భట్టిప్రోలు: వ్యవసాయ దినోత్సవాన్ని పురస్కరించు కొని శనివారం మండల వ్యవసాధికారి మీరయ్యను ఘనంగా సత్కరించారు. ఎంపిపి డివి లలితకుమారి, జెడ్పిటిసి టి ఉదరు భాస్కరిలు భట్టిప్రోల-1 రైతు భరోసా కేంద్రంలో మీరయ్యను దుశ్శాలువతో సన్మానించి మాట్లాడుతూ నిరంతరం రైతులకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు వారికి తగిన సలహాలు సూచనలు అందించాలని అన్నారు. వ్యవసాయ సిబ్బంది ఆయా రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ప్రభుత్వం అమలు చేసే పథకాలు వివరించి వారికి అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వివోఏలు రజని, మైత్రి, రత్నరాజు, నరేష్‌, నాయకుల మల్లేశ్వరరావు, బాలాజీ తదితరులు ఉన్నారు.