Apr 09,2023 22:33

ప్రజాశక్తి- మైలవరం : స్థానిక శాసనసభ్యులు వసంత వెంకటకష్ణ ప్రసాద్‌ జన్మదిన వేడుకలు ఆదివారం మైలవరంలో ఘనంగా నిర్వహించారు. లక్కిరెడ్డి బాల్‌రెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాల నుండి ర్యాలీగా స్థానిక వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యకర్తలు అభిమానులు మధ్య కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా పలువురు వసంతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డిగూడెం, జి కొండూరు, మైలవరం, ఇబ్రహీంపట్నం మండలాలకు చెందిన. ప్రముఖులు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.