Sep 08,2023 21:50

ఫొటో : డాక్టర్‌ బండి మరియా కుమార్‌ రెడ్డిని సన్మానిస్తున్న దృశ్యం

ఘనంగా వజ్రోత్సవ వేడుకలు
ప్రజాశక్తి-ఉదయగిరి : మేకపాటి గౌతంరెడ్డి వ్యవసాయ కళాశాలలో ఆచార్య ఎన్‌.జి. రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవాల వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ జి.కరుణా సాగర్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని కళాశాల విద్యార్థి కర్యకలాపాల అధికారి డాక్టర్‌ టి.గోపికృష్ణ నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటి ఉపన్యాస కర్యక్రమానికి జీవవైవిధ్య చట్టం 2002 దాని ఔచిత్యంను రాష్ట్ర జీవవైవిధ్య సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ బండి మరియా కుమార్‌ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆయన మాట్లాడారు. అనాదిగా మానవుడు ప్రకృతిని జివావరణాన్ని నాశనం చేస్తూ తన ఉనికికే ప్రమాదాన్ని సృష్టించుకున్నాడని తెలిపారు.
ఇది ఇలాగే కొనసాగితే మానవ జాతి కూడా ఈ భూమిపై నుండి అంతరించి పోతుందని ప్రతి ఒక్కరూ నడుంబిగించి ప్రకృతిలోని సమస్త జీవులను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ జి.కరుణా సాగర్‌ కళాశాల విద్యార్థి కర్యకలాపాల అధికారి డాక్టర్‌ టి.గోపికృష్ణ అన్ని విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థుల తరపున డాక్టర్‌ బండి మరియా కుమార్‌ రెడ్డిని శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.