ప్రజాశక్తి-సీతంపేట : మండలంలో రోలుగుడ్డు గ్రామంలో ఆర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో రైతు దినోత్సవం సందర్భంగా శనివారం విత్తన పండగను ఘనంగా నిర్వహించారు. డైరెక్టర్ నూక సన్యాసిరావు మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా ఆర్ట్స్ సంస్థ ఆదివాసి ప్రాంతాల్లో అనేక అభివృద్ధి, అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. రైతులు పండించిన పంటకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించి, వారి అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. విత్తనాల పండగ ద్వారా ఆదివాసీ సంప్రదాయాల పరిరక్షణకు అందరూ కృషి చేయాలని కోరారు. ఆమదాలవలస కెవికె సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.నీలవేణి మాట్లాడుతూ రైతులంతా సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలని కోరారు. చిరుధాన్యాల సాగుతో లాభాలు పొందాలన్నారు. ఉద్యానశాఖాధికారి పేడాడ జయశ్రీ మాట్లాడుతూ ఆదివాసీ ప్రాంతాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వినియోగించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ సింహాచలం, వివిధ సంస్థల ప్రతినిధులు బి.శంకర్రావు, రవీంద్రనాథ్, ఎ.గణేష్, తదితరులు పాల్గొన్నారు.










