Sep 25,2023 01:18

తిరువీధి సేవ నిర్వహిస్తున్న అర్చకులు

ప్రజాశక్తి -నక్కపల్లి:మండలంలోని ఉపమాక వెంకన్న ఆలయంలో వార్షిక బ్రహ్మౌత్సవాలు వైబోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి పుణ్యకోటి వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవ మూర్తులను మాడ వీధుల్లో ఘనంగా తిరువీధి సేవ నిర్వహించారు. ముందుగా ఆలయంలో అర్చక బృందం ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం తిరు వీధి సేవ నిర్వహించారు .పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు గొట్టుముక్కల వర ప్రసాదాచార్యులు, అర్చకులు కృష్ణమాచార్యులు, పీసపాటి వేంకట శేషాచార్యులు, భాగవతం గోపాలాచార్యులు, నండూరి రాజ గోపాలాచార్యులు, శివాలయం చైర్మన్‌ చెరుకూరి వెంకటేశ్వరరావు, దవరసింగి సన్యాసిరావు, ఈశ్వరరావు పాల్గొన్నారు .